మెదక్ ఫుట్​బాల్​ అకాడమీ ఆధ్వర్యంలో..క్రీడాకారులకు స్పోర్ట్స్ ​కిట్ల పంపిణీ

 మెదక్ ఫుట్​బాల్​ అకాడమీ ఆధ్వర్యంలో..క్రీడాకారులకు స్పోర్ట్స్ ​కిట్ల పంపిణీ

మెదక్​, వెలుగు: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ ఫుట్​బాల్​ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం మెదక్  ఔట్​డోర్​ స్టేడియంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద క్రీడాకారులతో సరదాగా ఫుట్​బాల్​ఆడారు.  అనంతరం మాట్లాడుతూ.. మహిళలు సాధించిన విజయాలు,- వారికి ఉన్న అడ్డంకులు, అనుభవిస్తున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు ఆలోచించడానికి ఏర్పాటు చేసే కార్యక్రమమే ఈ మహిళా దినోత్సవం అన్నారు.

పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మరింత మంది జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.  భవిష్యత్​లో ఏం సాధించాలనే విషయమై మీ కంటూ ఒక కలల పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్​బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కలెక్టర్ సహకారంతో బేటీ బచావో -బేటీ పడావో కార్యక్రమంలో అన్ని క్రీడల్లోజాతీయస్థాయిలో రాణించిన జిల్లా క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశామన్నారు.

జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ సహకారంతో ఫుట్​బాల్​ క్రీడాకారులు నిత్యం శిక్షణ పొందడానికి అనువైన ఏర్పాట్లు చేశామన్నారు. మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త సంతోష, ఫుట్​బాల్ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు వంశీకృష్ణ, వినయ్, మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు జుబేర్, ఉపాధ్యక్షుడు ఎం ఎల్ ఎన్ రెడ్డి పాల్గొన్నారు.